Published On: Sat, Nov 9th, 2019

కనుల పండువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణ ఏర్పాట్లు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: విజయవాడ స్వరాజ్య మైదానంలో ఈ నెల 18న (సోమవారం షష్ఠి) రోజున  శ్రీవల్లి, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణ మహోత్సవ  ఏర్పాట్లు కనులపండువగా జరుగుతున్నాయి. విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహా స్వామి చేతుల మీదుగా కళ్యాణం మహోత్సవం, కార్తీక  దీపోత్సవం నిర్వహిస్తున్నారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస సేవా  సమితి, గరిమెళ్ళ నాన‌య్య చౌదరి ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం, కోటి దీపోత్స‌వం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం స్వరాజ్య మైదానంలో కల్యాణ మహోత్సవానికి అంకురార్పణ జరిగింది. మామిడి లక్ష్మి వెంకట కృష్ణారావు, గరిమెళ్ళ నాన‌య్య చౌదరి, దూబగుంట్ల  శ్రీనివాసరావు దంపతులు లక్ష్మి గణపతి పూజ నిర్వహించారు. అనంతరం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పసుపుకొట్టే కార్య‌క్రమంలో పాల్గొన్నారు. మహిళల కోలాటంతో  సందడిగా మారింది. పవిత్ర కార్తీకమాసంలో లోకకల్యాణం, రాష్ట్రాభివృద్ధికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, కోటి దీపోత్స‌వం ఏర్పాటు చేయడం ఎంతో శుభకరమని, భక్తులు పాల్గొని  స్వామివార్ల కృపకు పాత్రులు కావాల్సిందిగా నిర్వాహకులు  గరిమెళ్ళ నాని కోరారు.

Just In...