Published On: Fri, Apr 13th, 2018

కరుణ ఫ్రీ క్లినిక్‌ను ప్రారంభించిన ర‌ఘువీరారెడ్డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: వైద్యం అత్యంత ఖ‌రీదైన ఈ రోజుల్లో ఉచితంగా వైద్య సేవ చేయాల‌ని డాక్ట‌ర్ గంగాధ‌ర్ త‌న చిన్న‌పిల్ల‌ల వైద‌శాల‌ను కరుణ ఫ్రీ క్లినిక్‌గా మార్చ‌డం అనేక మందికి స్పూర్తిదాయ‌కం అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. విశాలాంధ్ర రోడ్డులోని మెట్రో స్టోర్ స‌మీపంలో ఏర్పాటు చేసిన క్లీనిక్‌ను ర‌ఘువీరారెడ్డి గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య అమరులైన రోజున‌ కరుణ ఫ్రీ క్లినిక్ ప్రారంభించడం ఎంతో సంతోష‌దాయ‌క‌మ‌న్నారు. ప్రజలందరికీ మేలైన వైద్యం ఉచితంగా అందించాల‌ని ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ గంగాధ‌ర్‌కు ర‌ఘువీరారెడ్డి సూచించారు. ప్రాధమిక వైద్యం డబ్బు ఖర్చు లేకుండా అందరికి ఉచితంగా అందాల‌న్నారు. ఆ దిశగా వైద్యులు స్పూర్తి పొందాల‌న్నారు. ఈ క్లినిక్‌లో పిల్లలు, పెద్దలు, పేద, మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలు సేవలను సద్వినియోగం చేసుకోవాల‌న్నారు.
 

Just In...