Published On: Fri, Mar 20th, 2020

కరోనా భయంకరమైన వైరస్.. రాకుండా చూసుకోవాలి

* టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు

 సెల్ఐటి న్యూస్‌,  అమరావతి: కరోనా భయంకరమైన వైరస్… అది రాకుండా చూసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నామని, స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మూడు, నాలుగు వారాల వరకు కరోనా రాదని చీఫ్ సెక్రటరీ అన్నారని, నాలుగు రోజుల్లోనే వైరస్ వ్యాప్తి చెందిందన్నారు. సీఎం జగన్‌ ఏం చెప్తారని, రాజకీయ ప్రయోజనాలే తప్ప.. ప్రజా ప్రయోజనాలు చూడరని ఆరోపించారు. వైసీపీ కార్యక్రమాలు చూసి ఏకగ్రీవం అయ్యాయని చెప్పుకుంటున్నారని, బెదిరించి కాదని, ఎన్నికలకు వెళ్తే.. ప్రజలు బుద్ధి చెప్పేవారని బాబు చెప్పారు. కరోనా ప్రభావం లేకపోతే.. ఇప్పుడు చర్యలు ఎలా చేపట్టారని విమర్శించారు. ఆలయాలు, మాల్స్, విద్యా సంస్థలు, కంపెనీలు మూసివేస్తున్నారని తెలిపారు. ప్రధాని మోదీ సైతం కరోనాపై స్పందించి ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారని, ఇలాంటి పరిస్థితిలో ఎన్నికలు కావాలని పట్టుబడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల సంఘం ముందు చూపుతోనే ఎన్నికలు వాయిదా వేసిందని పేర్కొన్నారు. కరోనా భద్రత చర్యలు చేపట్టకుండా… ‌జగన్ భేషజాలకు పోయారు. ఇప్పుడు హడావుడిగా చర్యలు చేపట్టారు. ఇంత జరుగుతుంటే.. మాపై కేసులు పెడతారా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

Just In...