Published On: Fri, May 18th, 2018

కర్నాటకలో బిజేపి వైఖ‌రి ప‌ట్ల కాంగ్రెస్ నిర‌స‌న‌

* నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాలి

* నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి పిలుపు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: కర్నాటకలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసింద‌ని, బిజేపి వైఖ‌రీకి నిర‌స‌న‌గా  రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌లు ఉద్యమించాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేర‌కు ఏపిసిసి రాష్ట్ర కార్యాల‌యం నుంచి గురువారం ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. బిజేపి మొండి వైఖ‌రికి నిర‌స‌న‌గా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు  శుక్ర‌వారం ఉద‌యం నియోజకవర్గ స్థాయిలో నిరసన వ్య‌క్తం చేయాల‌ని ర‌ఘువీరా పిలుపునిచ్చారు.

Just In...