Published On: Mon, Oct 15th, 2018

కాంచీపురం వ‌ర‌మ‌హాల‌క్ష్మీ సిల్క్స్‌లో వారోత్స‌వాలు

* నూత‌న షోరూం ప్రారంభోత్స‌వంలో రాయితీ విక్ర‌యాలు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: నాణ్య‌త‌కు.. మ‌న్నిక‌కు.. పెట్టింది పేరైన కాంచీపురం వ‌ర‌మ‌హాల‌క్ష్మీ సిల్క్స్ విజ‌య‌వాడ నూత‌న షోరూంను అత్యాధునిక హంగుల‌తో మ‌హాత్మాగాంధీ రోడ్డులోని పాత షోరూం ప‌క్క‌న శ‌నివారం ఉద‌యం లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా నూత‌న ద‌స‌రా, దీపావ‌ళి పండ‌గ‌ల‌ను పుర‌స్క‌రించుకుని కొనుగోలుదారుల కోసం రాయితీతో కూడిన వారోత్స‌వాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు షోరూం డైరెక్ట‌ర్ రాజేష్ అన్నం తెలిపారు. కాంచీపురం సిల్క్, ఫ్యాన్సీ శారీస్, డిజైన‌ర్ శారీస్‌, డ్రెస్ మెటీరియ‌ల్స్‌, రెడీమేడ్స్‌, కుర్తీస్ త‌దిత‌ర వాటిపై రాయితీతో పాటు గెట్ వ‌న్ బై వ‌న్ ఇత‌ర ఆఫ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టామ‌న్నారు. ఈ రాయితీ విక్ర‌యాల‌ను వారోత్స‌వాల్లో కొనుగోలుదారులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని రాజేష్ అన్నం కోరారు. నూత‌న షోరూం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా శ‌నివారం షోరూంలో కొనుగోలుదారుల సంద‌డి నెల‌కొంది.

Just In...