Published On: Sun, Feb 2nd, 2020

కాట్రేనికోనలో గ్యాస్ పైప్‌లైన్ లీక్…

* భయాందోళనలో స్థానికులు

కాట్రేనికోన‌, సెల్ఐటి న్యూస్‌: తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలోని ఉప్పూడిలో ఓఎన్జీసీ రింగ్ వ‌ద్ద గ్యాస్ పైప్‌లైన్‌కు లీకేజీ ఏర్ప‌డింది. దీంతో పైప్‌లైన్ నుంచి సహజవాయువు భారీగా లీకవ‌డంతో స్థానికులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌గా గ్యాస్ పైప్‌లైన్ లీకైన ప్రాంతం నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రజలను ఖాళీ చేయించారు. ఓఎన్జీసీ నిర్వహణ పనుల్లో భాగంగా రిగ్గు వద్ద మరమ్మతులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మ‌రోవైపు పెద్ద శబ్దంతో గ్యాస్ లీకవడంతో స్థానికులు ఒక్క‌సారిగా భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు, పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని గ్యాస్ లీక్‌ను అరిక‌ట్టేందుకు యుద్ధ ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్ట‌డారు. ప్ర‌స్తుతం కాట్రేనికోనలో ప్రధాన రహదారిపై రాకపోకలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

Just In...