Published On: Tue, Aug 13th, 2019

కాన్పు కోసం వస్తే కడతేర్చారు…

* వినుకొండ  ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింత మృతి

* వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందిందని బంధువులు ఆందోళన

సెల్ఐటి న్యూస్, గుంటూరు క్రైమ్: శావల్యాపురం మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన అంబటి అమలను కాన్పు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి  కుటుంబ సభ్యులు తీసుకురాగ కాన్పు అయిన కొద్దిసేపట్లోనే మహిళ మృతి చెందింది. దీoతో భర్త, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంత జరిగినప్పటికీ కనీసం మానవత్వం చూపకుండా పుట్టిన బిడ్డను కూడా చికిత్స నిమిత్తం తన ప్రైవేటు ఆసుపత్రికి పంపించాడు ఆ వైద్య ప్రబుద్దుడు… వచ్చిన కేసులను చాలా వరకు తన ఆసుపత్రికి పంపిస్తున్నాడని బంధువులు, రోగులు ఆరోపిస్తున్నారు.

Just In...