Published On: Tue, Sep 17th, 2019

కారుణ్య నియామకం కింద నాగజ్యోతికి ఉద్యోగం

* మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: బోటు ప్రమాద ఘటనలో దేవదాయ శాఖ ఈవో రఘురాం మృతిపట్ల  సంతాపం, వారి కుటుంబ సభ్యులకు దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుంచి మంగ‌ళ‌వారం ప్రకటన విడుదల చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం అమరేశ్వర ఆలయంలో గ్రేడ్ టు ఈవోగా పనిచేస్తున్న రఘురాం (40) బోటు ప్రమాదంలో మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. విషయం తెలిసిన  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఫోన్‌లో రఘురాం భార్య నాగజ్యోతిని పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పాపికొండలు ఘటన చాలా బాధాకరమన్నారు. కారుణ్య నియామకం కింద నాగజ్యోతికి  దేవాదాయ శాఖలో ఉద్యోగం కల్పిస్తామని భరోసానిచ్చారు.

Just In...