Published On: Wed, Feb 19th, 2020

కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వాస్పత్రులు

కర్నూలు, సెల్ఐటి న్యూస్‌: రానున్న మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. అవసరమైన చోట జాతీయ ప్రమాణాలతో నూతన ఆస్పత్రులను కూడా నిర్మిస్తామని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు మూడో విడత కార్యక్రమాన్ని ఆయన మంగళవారం కర్నూలులో ప్రారంభించారు. కర్నూ లును జ్యుడీషియల్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఓపెన్‌ టాప్‌ జీపుపై వెళ్తున్న జగన్‌కు స్థానిక ప్రజలు పూలవర్షం కురిపించారు. అనంతరం ఎస్‌టిబిసి కళాశాలలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మారుమూల ఉన్న గ్రామాల్లో ఉన్న ఆసుపత్రుల నుండి బోధనాస్పత్రుల వరకు అన్ని ఆస్పత్రుల రూపురేఖలు మారుస్తామని చెప్పారు. ప్రభుత్వాస్పత్రులన్నింటినీ రూ.15,333 కోట్లతో ఆధునీకరిస్తున్నామని ప్రకటించారు. రాష్ట్రం లో ప్రస్తుతం 11 మెడికల్‌ కళాశాలలు మాత్రమే ఉన్నాయని, ప్రతి పార్లమెంటు నియోజక వర్గం పరిధిలోనూ ఒక బోధనాస్పత్రి ఉండేలా మరో 16 కొత్త మెడికల్‌ కళాశాలలను, 16 నర్సింగ్‌ కళాశాల లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మూడో దశ వైఎస్‌ఆర్‌ కంటి వెలుగు పథకంలో భాగంగా 54 లక్షల మంది వృద్ధులకు ఉచితంగా కంటి పరీక్షలు, శస్త్ర చికిత్సలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను ఇస్తామని తెలిపారు. మార్చి ఒకటి నుంచి 133 కేంద్రాల్లో వృద్ధులకు కంటి ఆపరేషన్లు ప్రారంభమవుతా యన్నారు.

Just In...