Published On: Tue, Feb 5th, 2019

కార్పొరేషన్లు లేని బీసీ సామాజిక వర్గాలకు ఆర్ధిక చేయూతలో ప్రాధాన్యం

* అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: కొత్తగా ఏర్పాటైన బీసీ కార్పొరేషన్ల పరిధిలోకి రాని, కార్పొరేషన్లు లేని బీసీలకు ప్రభుత్వ ఆర్ధిక పథకాల అమలులో అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను మంగ‌ళ‌వారం  ఆదేశించారు. ఈ విష‌యంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సీఎం భరోసా ఇచ్చారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం చేస్తున్న బీసీ కార్పొరేషన్ ద్వారా అమలు జరుగుతున్న ఆర్ధిక చేయూత కార్యక్రమాలలో బీసీ కార్పొరేషన్ల పరిధిలోకి ఇంకా తీసుకురాని బీసీ సామాజిక వర్గాలయిన సూర్యబలిజ, కూరాకుల, అచ్చుకట్లవాండ్ల, జక్కల సామాజిక వర్గాలకు ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. ఆయా సామాజిక వర్గాల నుంచి వచ్చిన అభ్యర్ధనలు, ప్రతిపాదనల మేరకు ముఖ్యమంత్రి తక్షణం స్పందించారు. బీసీ ఫెడరేషన్లను బీసీ సామాజిక వర్గాల కార్పొరేషన్లుగా ఉన్నతీకరణ చేసిన తమ ప్రభుత్వం పథకాల ఫలాలు అందరికీ అందాలన్న ఆకాంక్షతో పనిచేస్తోందని సీఎం చంద్రబాబు వివరించారు.

Just In...