Published On: Fri, Jun 14th, 2019

కార్మికులకు అన్ని వేళలా అండగా ఉంటా..

* రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల మంత్రి గుమ్మనూరు జయరాం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో ఉన్న కార్మికులకు అన్ని వేళలా అండగా ఉంటానని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తానని రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. సచివాలయంలోని మూడో బ్లాక్‌లో ఉన్న తన కార్యాలయంలో శుక్రవారం కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆశీర్వచనంతో తనకీ పదవీ బాధ్యతలు లభించాయన్నారు. సీఎం…తనపై ఉంచిన నమ్మకాన్ని నిజమయ్యేలా కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వైఎస్ఆర్ ఆదరణ పథకం కింద కార్మికులందరికీ వైద్య సేవలు, బీమా సదుపాయలు వర్తింపజేస్తామన్నారు. ముందుగా వేదపండితుల మంత్రోచ్ఛారణాలు, ఆశీర్వచనాల నడుమ మంత్రి గుమ్మనూరు జయరాం కార్యాలయ ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రికి కార్యాలయ అధికారులు, కార్యకర్తలు, నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Just In...