Published On: Wed, Aug 30th, 2017

కాల్వలో దూకి గర్భిణీ ఆత్మ‌హ‌త్య‌

సెల్ఐటి న్యూస్‌, దుగ్గిరాల (గుంటూరు డెస్క్‌): గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని రేవేంద్రపాడు గ్రామానికి చెందిన చావలి భవ్య(24) ఫుట్‌బ్రిడ్జిపై నుంచి పశ్చిమ డెల్టా కాల్వలోకి దూకింది. ఆమె ఏడు నెలల గర్భిణి. మంగళగిరిలో వైద్యపరీక్షల నిమిత్తం మంగళవారం suside_29-08-17_1ఉదయం ఇంటి నుంచి తండ్రితో ఆమె బయలుదేరింది. తండ్రి శివలాల్‌ ఫుట్‌బ్రిడ్జిపై ముందు నడుస్తుండగా వెనుకనున్న ఆమె ఉన్నట్లుండి ఒక్కసారిగా పశ్చిమడెలా కాల్వలోకి దూకింది. తండ్రి గమనించి కేకలు వేశాడు. సమీపంలో సాయపడేందుకు ఎవరూ లేకపోవడం, 4 వేల క్యూసెక్కుల నీటితో నిండుగా ఉధృతంగా ప్రవహిస్తున్న కాల్వలోకి దూకిని వెంటనే భవ్య మునిగిపోయింది. వట్టిచెరుకూరు మండలం సౌపాడుకు చెందిన చావలి వీరనారాయణతో భవ్యకు ఏడాదిన్నర క్రితం వివాహమైంది, భవ్యకు తొలి విడత అబార్షన్‌ కాగా, అప్పటి నుంచి ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నెలరోజుల క్రితం సౌపాడు నుంచి పుట్టింటికి వచ్చిన భవ్య తనతో ఫోన్‌లో ఎప్పుడూ పరధ్యానంగా మాట్లాడేదని భర్త వీరనారాయణ తెలిపారు. ఎస్‌ఐ ఎం.మురళి సంఘటనా స్థలానికి చేరుకుని భర్త, తండ్రి ఇతర కుటుంబ సభ్యులను విచారించారు. కాల్వలో దూకిన భవ్య ఆచూకీ సాయంత్రం వరకూ లభించలేదని పోలీసులు తెలిపారు.

Just In...