Published On: Wed, Jun 12th, 2019

‘కాళేశ్వరం’ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా వైఎస్ జగన్‌

సెల్ఐటి న్యూస్‌, హైద‌రాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈ నెల 21న ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే సీఎం కేసీఆర్‌ స్వయంగా విజయవాడ వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు. దాదాపు 151 టీఎంసీల గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ స‌ర్కార్ కల సాకారమైంది.

Just In...