Published On: Tue, Sep 25th, 2018

కిడారి కుటుంబానికి రూ.42 లక్షలు ప‌రిహారం

సెల్ఐటి న్యూస్‌, విశాఖపట్నం: మావోయిస్టుల చేతుల్లో హ‌త్య‌కు గురైన అరకు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్‌ కిడారి సర్వేశ్వరరావు కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.42 లక్షల పరిహారం అందనుంది. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వానికి పంపే నివేదికలో అధికారులు ఈ ప్రతిపాదన చేసినట్లు సమాచారం. మృతిచెందిన ఎమ్మెల్యేల కుటుంబంలో డిగ్రీ చదివిన పిల్లలుంటే వారికి డిప్యూటీ కలెక్టర్‌ హోదాతో కూడిన ఉద్యోగం గ‌తంలో ప్రభుత్వం ఇచ్చింది. ఇదే విధానం కిడారి కుటుంబానికి వర్తిస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అలాగే మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబానికి రూ.12 లక్షల వరకూ పరిహారాన్ని చెల్లించనున్నారు. ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యేలకంటూ ఇప్ప‌టివ‌ర‌కూ ప్రభుత్వ ఉత్తర్వులలో ఎటువంటి ప్రస్తావన లేదు. ఈ కారణంగా మావోల చేతిలో పౌరులు చనిపోతే ఎంతమేర పరిహారం చెల్లిస్తారో అంతే సోమ కుటుంబానికి ఇవ్వనున్నారు. ఇవి కాకుండా ప్రభుత్వం అదనపు ప్రయోజనాలను ప్రకటిస్తే ఆమేరకు రెండు కుటుంబాలకు అందజేయనున్నారు.

Just In...