Published On: Mon, Aug 14th, 2017

కిలో ఉల్లి రూ.22కే విక్రయించాలి

* సీఎం చంద్రబాబు ఆదేశాలు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రైతుబజార్లలో కిలో ఉల్లి రూ.22కే విక్రయించాలని సీఎం చంద్రబాబునాయుడు అధికారుల‌కు  సూచించారు. ప్రతి మేజర్ పంచాయితీల్లో రైతు బజార్ ఏర్పాటు చేయాలన్నారు. డ్వాక్రా మహిళల ద్వారా కూరగాయల సాగు ప్రోత్సహించాలని తెలిపారు. డిమాండ్‌కు తగ్గ స‌ర‌ఫ‌రాతో పాటు ధరలపై నియంత్రణ ఉండాలన్నారు. రైతుబజార్ల వ్యవస్థ, ఉద్యాన శాఖ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. అగ్రివాచ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించాలన్నారు.

onions_2

Just In...