Published On: Sun, Dec 2nd, 2018

కిషోర్‌బాబు చరిత్ర సృష్టించారు

* ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడం ద్వారా మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు చరిత్ర సృష్టించారని ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం అన్నారు. కృష్ణలంకలోని ఆయన కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోగంటి సత్యం మాట్లాడుతూ ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలోకి మారడం ద్వారా కిషోర్‌బాబు మగాడిగా నిలిచారని వ్యాఖ్యానించారు. మాల, మాదిగలకు కిషోర్‌బాబు మంత్రిగా ఉండగా ఎంతో చేశారని ముఖ్యంగా ఏమి చేయాలన్నా కూడా అంతా సీఎం చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. రెండు పదవులకు రాజీనామా చేసి వచ్చిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబును పార్టీలోకి తీసుకున్నందుకు ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి కోగంటి సత్యం ధన్యవాదాలు తెలిపారు. పదవులకు రాజీనామా చేయకుండా మరో పార్టీలోకి మారితే రానున్న రోజుల్లో ప్రజలు తన్నే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ ఎస్.పి.గ్రిటన్ మాట్లాడుతూ రావెల కిషోర్‌బాబు పదవులకు రాజీనామా చేసి మ‌రో పార్టీలో చేరడం ద్వారా నైతిక విలువ‌ల‌కు అద్దం ప‌ట్టార‌ని పేర్కొంటూ కిషోర్‌బాబును అభినందించారు. విలేకర్ల సమావేశంలో సిపిఐ నాయకులు బండారు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Just In...