Published On: Sat, Mar 16th, 2019

కుటుంబ‌స‌మేతంగా శ్రీవారిని ద‌ర్శించుకున్న చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: తెదేపా జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం ఉద‌యం కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఎన్నిక‌ల ప్రచారం ప్రారంభానికి ముందు త‌మ ఇష్ట‌దైవ‌మైన శ్రీవారిని చంద్ర‌బాబు ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆల‌య అధికారులు వారికి పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికి స్వామి వారి ద‌ర్శ‌నం చేయించారు. అనంత‌రం స్వామివారి చిత్ర‌ప‌టంతో పాటు ప్ర‌సాదాల‌ను అందించారు.

Just In...