Published On: Fri, May 29th, 2020

కృష్ణలంక, కార్మికనగర్ ప్రాంతాల్లో సడలింపులివ్వండి..

* వైసీపీ విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్

* సీపీ ద్వార‌కా తిరుమ‌ల‌రావుకు విన‌తి ప‌త్రం అంద‌జేత‌

విజ‌య‌వాడ‌(గుణ‌ద‌ల‌), సెల్ఐటి న్యూస్‌: కరోనా వైర‌స్ వ్యాప్తి నేప‌‌ధ్యంలో లాక్‌డౌన్ అమ‌లు కార‌ణంగా ఉపాధి లేక కృష్ణలంక, కార్మికనగర్ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నార‌ని విజయవాడ తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో వారి ద‌య‌నీయ స్థితిని దృష్టిలో పెట్టుకొని దుకాణదారులకు, పనులు చేసుకొనే కార్మికులకు కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరుతూ విజయవాడ విజ‌య‌వాడ సీపీ సీహెచ్ ద్వా‌రకా తిరుమ‌ల‌రావును క‌లిసి శుక్ర‌వారం విన‌తిప‌త్రం అంద‌జేశారు. ‌సానుకూలంగా స్పందించిన కమిషనర్ అక్కడి పరిస్థితులు ఒకసారి పరిశీలించి వారికి ఉపకరించే నిర్ణయం తీసుకుంటామని తెలియజేసినట్లు అవినాష్ మీడియాకు తెలిపారు.

Just In...