Published On: Tue, Oct 13th, 2020

కృష్ణానదికి వరద ఉద్ధృతి…

* నేడు మొద‌టి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకోనున్న వరద

* అధికారులు, ప్రజలను అప్రమత్తం చేసిన కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కి బుధవారం ఉదయం నాటికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద చేరుకుంటున్న దృష్ట్యా అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ చెప్పారు. వరద ప్రవాహం క్రమేణ పెరుగుతున్న దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో మంగళవారం కలెక్టర్ ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. కృష్ణానది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారుల సూచనలు పాటించి సహకరించాలన్నారు. బోట్లు, మోటారు బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించవద్దని హెచ్చరించారు. వరద నీటిలో ఈతకు వెళ్లడం, స్నానాల చేయడం వంటివి చేయరాదన్నారు. భారీవర్షాలు మూలంగా ప్రకాశం బ్యారేజికి అధికంగా వరద నీరు చేరుకుంటుందని అది బుధవారం ఉదయం నాటికి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరుకుంటుందన్నారు. మంగళవారం సాయంత్రం 7 గంటల నాటికి ప్రకాశం బ్యారేజ్ వద్ద అవుట్ ఫ్లో 2,69,600 క్యూసెక్కులు కాగా ఇప్లో 2,71,742 క్యూసెక్కులు ఉందన్నారు. మున్నేరు ఇఫ్లో 29,709 క్యూసెక్కులు ఉండగా అవుట్ ప్లో 29,709 క్యూసెక్కులు అన్నారు. పులిచింతల ప్రాజెక్టు వద్ద మంగళవారం సాయంత్రం 6 గంటలకు అవుట్ ఫ్లో 2,92,417 క్యూసెక్కులు ఉండగా ఇన్ ఫ్లో 3.45గ లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి వ‌ర‌ద ప‌రిస్థితిని ప‌రిశీలించి అధికారులు, ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. 

Just In...