Published On: Wed, Sep 9th, 2020

కృష్ణా జిల్లాలో కొత్త‌గా 16 కాంటైన్మెంట్ జోన్లు

* క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్‌

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌: కృష్ణా జిల్లాలో నూతనంగా 16 కాంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగిందని జిల్లాకలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ బుధ‌వారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాంతాల్లో నూతనంగా కరోన పొజిటివ్ కేసులు నమోదైన నేప‌ధ్యంలో కరోనా వ్యాప్తి నిరోధించడానికి కంటైన్మెంట్ జోన్లు ప్రకటించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆయా ప్రాంతాలలో కంటోన్మెంట్ నిబంధనలు కచ్చితంగా అమలు చేయడం జరుగుతుందని, ప్రజలు ఎవరు బయటకు రాకూడదని పేర్కొన్నారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రజలు సహకరించాలన్నారు.

*కాంటైన్మెంట్ జోన్లు ఇవే*….

1. ఘంటసాల మండలంలోని మల్లంపల్లి గ్రామం
2. గూడూరు మండలంలో కంచకోడూరు గ్రామం
3. కంచికచర్ల మండలంలో ఎస్.అమరవరం గ్రామం
4. కంకిపాడు మండలంలో దావులూరు గ్రామం
5. కోడూరు మండలంలో మందపాకల గ్రామం
6. మండవల్లి మండలంలో కొవ్వాడలంక గ్రామం
7. మోపిదేవి మండలంలో చిరువోలు గ్రామం
8. మొవ్వ మండలంలో బర్లపూడి గ్రామం
9. పామర్రు మండలంలో కొమరవోలు గ్రామం
10. పమిడిముక్కల మండలంలో పమిడిముక్కల గ్రామం
11. పెడన మండలంలో బోర్రపోతుపాలెం గ్రామం
12. పెడన మండలంలో ఉరివి గ్రామం
13. పెదపారుపూడి మండలంలో గురువిందగుంట గ్రామం
14. ఉంగుటూరు మండలంలో ఇందుపల్లి గ్రామం
15. విసన్నపేట మండలంలో తాటకుంట్ల గ్రామం
16. విసన్నపేట మండలంలో వేమిరెడ్డిపల్లి గ్రామం

Just In...