Published On: Sun, Feb 2nd, 2020

కృష్ణ‌మ్మ‌కు వైభ‌వంగా ప‌విత్ర హార‌తులు…

ఇంద్ర‌కీలాద్రి, సెల్ఐటి న్యూస్‌: శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వ‌ర్యంలో ప్రతి రోజు పవిత్ర దుర్గా ఘాట్ వద్ద నవ హారతుల విశిష్టతను తెలియజేస్తూ కృష్ణా నదీమ తల్లికి పవిత్ర హారతులు సమర్పించు కార్యక్రమం దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఆదివారం ఘ‌నంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం నందు శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల పల్లకి సేవ అత్యంత వైభవోపేతంగా జరిగింది. త్రిలోక సంచారానికి గుర్తుగా శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాకారం చుట్టూ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య భక్తుల జయ జయ భవానీ నామస్మరణతో మూడు పర్యాయాలు ప్రదక్షిణలు చేయడం జరిగినది. ఈ  కార్యక్రమానికి వందలాది మంది భక్తులు వీక్షించి, ఆలయ ప్రదర్శనం చేశారు.

Just In...