Published On: Sat, May 30th, 2020

కృష్ణ‌లంక‌, కార్మిక‌న‌గ‌ర్ ప్రాంతాల్లో స‌డ‌లింపులివ్వండి..

* జిల్లా క‌లెక్ట‌ర్, సీపీకి ఎమ్మెల్యే గ‌ద్దె విన‌తి ప‌త్రం అంద‌జేత‌

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: కరోనా వైర‌స్ వ్యాప్తి నేప‌‌ధ్యంలో లాక్‌డౌన్ అమ‌లు కార‌ణంగా ఉపాధి లేక కృష్ణలంక, కార్మికనగర్ ప్రజల‌కు స‌డ‌లింపులిచ్చి ఊర‌ట క‌ల్పించాల‌ని విజయవాడ తూర్పు నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు కోరారు. ఈ మేర‌కు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతి‌యాజ్‌, ‌ విజ‌య‌వాడ సీపీ సీహెచ్ ద్వా‌రకా తిరుమ‌ల‌రావును క‌లిసి శ‌నివారం విన‌తి ప‌త్రం అంద‌జేశారు. లాక్‌డౌన్ అమ‌లు నేఫ‌ధ్యంలో కృష్ణ‌లంక‌, కార్మిక‌న‌గ‌ర్ ప్రాంతాల వారి ద‌య‌నీయ స్థితిని దృష్టిలో పెట్టుకొని దుకాణదారులకు, పనులు చేసుకొనే కార్మికులకు వెసులుబాటు క‌ల్పిస్తూ కొన్ని సడలింపులు ఇచ్చే అంశాన్ని ప‌రిశీలించాల‌ని ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు ‌కోరారు.

Just In...