Published On: Tue, Apr 17th, 2018

కేంద్రం వైఖ‌రికి నిర‌స‌న‌గా చంద్రబాబు ‘ధర్మపోరాట దీక్ష’

* ఈ నెల 20న ముహూర్తం

* వేదిక ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియం 

సెల్ఐటి న్యూస్‌, అమరావతి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 20 ‘ధర్మపోరాట దీక్ష’ చేయనున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7గంటల వరకు 12 గంటల పాటు దీక్ష చేయనున్నారు. ఈ నెల 20న పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని, ఆ రోజంతా నిరాహారదీక్షతో నిరసన తెలియజేయాలని చంద్రబాబు నిర్ణయించారు. పుట్టినరోజు నాడు ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం నిరశన దీక్ష చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం.
30న తిరుపతిలో బహిరంగ సభ…
రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయంపై ఈ నెల30న తిరుపతిలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ‘నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో తిరుపతి సభ నిర్వహించనున్నారు.

Just In...