Published On: Sat, Jun 27th, 2020

కేంద్ర‌మంత్రి వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి

* ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: విద్యుత్‌పై కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం కొట్టిపారేశారు. ఏపీలో ఇండస్ట్రియల్‌ విద్యుత్‌ టారిఫ్‌ రూ.7.65 ఉందని తెలిపారు. 2017లో ఉన్న టారిఫ్‌నే ఈ ప్రభుత్వం కొనసాగిస్తోందని, నిర్మల సీతారామన్ ‌చెబుతున్న రూ.9 ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదన్నారు. రూ.2.75కి విద్యుత్‌ను ఎక్కడ ఇస్తున్నారో కేంద్రం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. పరిశ్రమలకు ఏ రాష్ట్రం కూడా రూ.7కి తక్కువగా విద్యుత్‌ ఇవ్వట్లేదని కల్లం తెలిపారు. మైన్స్‌ కేటాయించాలని ఎన్ని సార్లు కోరినా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. దీని వల్ల రాష్ట్రం ప్రతి ఏడాది నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో పవర్‌ సెక్టార్‌పై నిర్మలా సీతారామన్‌కు సరైన సమాచారం లేదన్నారు. విద్యుత్‌ అప్పు రూ.70 వేల కోట్లు ఉందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే స్థితిలో లేదని తేల్చిచెప్పారు. కేంద్రం తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని తెలిపారు. కృష్ణపట్నం డిజైనింగ్‌ మాజీ సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో చేసినా తర్వాత మార్పులు జరిగాయని పేర్కొన్నారు. విద్యుత్‌ సంస్థల అప్పుల పాపం తమది కాదని అజయ్‌ కల్లం చెప్పారు.

Just In...