Published On: Tue, Jun 12th, 2018

కేరళ త‌ర‌హాలో ప్రభుత్వ విద్యా విధానాన్ని అమలుచేయాలి

* ఊమెన్ చాందీని కోరిన విజయవాడ మళయాళీల బృందం 

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: విజయవాడ నుంచి కేరళకు రైలును ఏర్పాటు చేయాలని కేరళ రాష్ట్రం నుంచి వచ్చి విజయవాడలో స్థిరపడిన మళయాళీల బృందం ఏపిసిసి ప్రధాన కార్యదర్శి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కలిసి కోరారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వ్యవహారాల ఇన్ చార్జిగా నియమింపబడిన ఊమెన్ చాందీ మొట్టమొదటి సారి విజయవాడ వచ్చిన సందర్భంగా విజయవాడలోని కేరళ క్లబ్ ఆధ్వర్యంలో దాదాపు 100 మంది ఊమెన్ చాందీని మంగ‌ళ‌వారం ఉద‌యం ఆంధ్ర‌త‌ర్న‌భ‌వ‌న్‌లో క‌లిసి వారి సమస్యలను విన్నవించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్య ప్రైవేట్ వ్యాపారంగా మారిందని, దీంతో విద్యార్థుల చదువు చాలా ఆర్థిక భారంగా మారిందన్నారు. కేరళ రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న మాదిరిగా ఏపీలో కూడా ప్రభుత్వ విద్యా విధానాన్ని అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ వలన వ్యాపారులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని వాపోయారు. నోట్ల రద్దు, జీఎస్టీ కారణంగా ప్రజల వద్ద డబ్బు లేక చిన్న చిన్న వ్యాపారాలు నడవడం లేదన్నారు. వ్యాపారాలపై ఆధారపడిన మళయాళిలు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి దృష్టికి తీసుకువచ్చారు. ఊమెన్ చాందీని కలిసిన వారిలో కేరళ క్లబ్ అధ్యక్ష‌, కార్య‌ద‌ర్శులు జోహన్, వాసు, మణి, హకీమ్, కృష్ణనందా, జయశంకర్, సత్యానంద్, మోహిద్ తదితరులు ఉన్నారు.

Just In...