Published On: Thu, Nov 8th, 2018

కొండపల్లి ఖిల్లాకు పూర్వ వైభవాన్ని తీసుకోస్తాం

* రాజధాని ప్రాంతంలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా రూప‌క‌ల్ప‌న 

* రూ.10 కోట్లతో ఖిల్లా పునరుద్ధరణ పనులు

* డిసెంబర్ మూడో వారంలో 2 రోజుల పాటు కొండపల్లి ఖిల్లా ఉత్సవాలు 

* ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శన

* మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

సెల్ఐటి న్యూస్‌, ఇబ్రహీంపట్నం (కొండపల్లి): కొండపల్లి ఖిల్లాకు పూర్వ వైభవాన్ని తీసుకోస్తామని, రాజధాని ప్రాంతంలో ప్రముఖ పర్యాటక క్షేత్రంగా ఖిల్లా విరాజిల్లబోతుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం పర్యాటక శాఖ ఎండి హిమాంశు శుక్లా, పురావస్తు శాఖ కమిషనర్ వాణీమోహన్, అధికారులు  మరియు ప్రజాప్రతినిధులతో కలసి కొండపల్లి ఖిల్లాను సందర్శించారు. ఖిల్లా ఉత్సవాలను పురస్కరించుకొని చేయవలసిన ఏర్పాట్లపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొండపల్లి ఖిల్లా పరిశీలించారు. ఖిల్లాలోని పురాతన శిలలను  రాజమహల్‌ను, రాణి మహల్, కారాగారాన్ని, ఆయుధ భాండాగారాన్ని మరియు ఇతర ప్రాంతాలను పరిశీలించి చేయవల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఉన్నతాధికారులతో మాట్లాడి అక్కడ ఏర్పాట్లకు కావలసిన అనుమతులను తక్షణమే మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ మాట్లాడుతూ మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ మాట్లాడుతూ, రూ.10 కోట్లతో కొండపల్లి ఖిల్లా పునరుద్ధరణ పనులు చేస్తున్నట్లు, డిసెంబర్ మూడో వారంలో 2 రోజుల పాటు కొండపల్లి ఖిల్లా ఉత్సవాలు పర్ద ఎత్తున జరగనున్నాయని ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విచ్చేసి ఫొటో ఎగ్జిబిషన్, మ్యూజియం ను ప్రారంభిస్తారని తెలిపారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా కొండపల్లి ఖిల్లా విరాజిల్లబోతున్నదని అత్యంత పురాతనమైన ఈ ఖిల్లాను పర్యాటకులు విశేషంగా సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. శతాబ్దాల చరిత్రగల కొండపల్లి ఖిల్లాను మన భావి తరాలకు అందించవలసిన బాధ్యత మనపై ఉందని అందుకోసం ప్రత్యేకంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నామని,  రాజధానికి కొండపల్లి ఖిల్లా ముఖ్య పర్యాటక ప్రాంతంగా ఉంటుందని మంత్రి తెలిపారు.

Just In...