Published On: Wed, Aug 21st, 2019

కొండవీటి వాగుతో అమరావతికి ముప్పు..

* ఎంపీ విజయసాయి రెడ్డి  కీలక వ్యాఖ్యలు

సెల్ఐటి న్యూస్, దిల్లీ: వైకాపా ముఖ్యనేత, ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సంప్రదించే తీసుకుంటున్నారని చెప్పారు. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి రాష్ట్ర ఖజానాను దోచుకుందని.. అలాంటి వారందర్నీ చట్టపరిధిలోకి తీసుకురావాలనేదే తమ దృఢ సంకల్పమన్నారు. బుధవారం దిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కొండవీటి వాగు వల్ల అమరావతి ముంపునకు గురయ్యే ప్రమాదముందని చెప్పారు. అవినీతి నివారణలో తమ సంకల్పానికి మోదీ, అమిత్‌షా ఆశీస్సులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌, పీపీఏ అంశాల్లోనూ ప్రధాని మోదీతో మాట్లాడాకే సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు.

Just In...