Published On: Sat, Oct 24th, 2020

కొండా‌ల‌మ్మ సేవ‌లో మంత్రి కొడాలి నాని కుటుంబం…

* నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంభాభిషేకం

* మంత్రి దంపతులను సత్కరించిన రామిరెడ్డి

గుడ్ల‌వ‌ల్లేరు, సెల్ఐటి న్యూస్‌: కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం వేమవరంలో వేంచేసి ఉన్న శ్రీ కొండాలమ్మ అమ్మవారిని శనివారం రాష్ట్ర పౌరసరఫ‌రాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) కుటుంబ సమేతంగా  దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమ్మవారికి కుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. హారతి అనంతరం అమ్మవారి పల్లకిని మంత్రి ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం మంత్రి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ చైర్మన్ కనుమూరి రామిరెడ్డి మంత్రి కొడాలి నాని దంపతులను నూతన వస్రాలతో సత్కరించారు. ఆలయ ఈవో నటరాజన్ షణ్ముగం మంత్రి దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ కొండలమ్మ అమ్మవారి దేవస్థానంలో దసరా సందర్భంగా నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా అలంకారం, హోమాలను ధర్మకర్తల మండలి వైభవోపేతంగా నిర్వహిస్తోందన్నారు. కాగా రాష్ట్ర ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కరోనా విపత్కర పరిస్థితులు తొలగిపోవాలని ప్రార్థించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి అవసరమైన శక్తియుక్తులను అందజేయాలని మంత్రి ఆకాంక్షించారు.
కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు బుడిగా లీలా సౌజన్య, మన్నెం అమల, పడవల వెంకటేశ్వరరావు, పామర్తి వెంకటస్వామి, దొకల భాగ్యలక్ష్మి, వల్లూరి పద్మావతి, నరేపాలెం వెంకట నిర్మల, ఈడే నిర్మల, ఎక్స్ అఫిషియో సభ్యుడు ఆర్.ఎస్.ఎస్.సంతోష్ వర్మ, వైసీపీ నేత రాంప్రసాద్, మండల అధ్యక్షుడు రవికుమార్, మాధవ, అల్లూరి ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

 

Just In...