Published On: Tue, Mar 19th, 2019

కొండ‌ప్రాంత స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తా..

* ఎన్నిక‌ల ప్ర‌చారంలో తెదేపా ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిని ష‌బానా ఖాతూన్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ (పాత‌బ‌స్తీ): ఈ ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపిస్తే కొండ‌ప్రాంత ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థిని ష‌బానా ఖాతూన్ అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా మంగ‌ళ‌వారం ఉద‌యం ఆమె 38వ డివిజ‌న్‌లోని కోమ‌ల‌విలాస్ సెంట‌ర్‌, బ్రాహ్మ‌ణ‌వీధి పాత పోస్టాఫీస్ రోడ్డు, చేప‌ల‌మార్కెట్‌, కొండ‌ప్రాంతంలో ప‌ర్య‌టించారు. ఆమెకు మ‌ద్ద‌తుగా కేశినేని శ్వేత పాల్గొని ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికీ తిరుగుతూ ఎన్నిక‌ల్లో త‌న‌ను గెలిపించాల‌ని ఓట‌ర్ల‌ను అభ్య‌ర్థించారు. త‌న‌కు వేసిన ఓటు అభివృద్ధికి వేసిన‌ట్లేన‌ని పేర్కొంటూ స్థానికుల‌ను ఓట్లు అభ్య‌ర్థిస్తూ ప్ర‌చారం నిర్వ‌హించారు. కొండ‌ప్రాంతంలో పైభాగం వ‌ర‌కు వెళ్లి ఓట‌ర్ల‌ను క‌లుసుకుని ఎన్నిక‌ల్లో త‌న‌కు మ‌ద్ద‌తు తెలపాల‌ని కోరారు. చేప‌ల‌మార్కెట్ వ‌ద్ద బుట్ట‌ల అల్లిక‌లు అల్లుతూ కేశినేని శ్వేత వినూత్నంగా ష‌బానా త‌ర‌ఫున ప్ర‌చారం నిర్వ‌హించారు.

Just In...