Published On: Fri, May 22nd, 2020

*కొల్లి*కి కన్నీటి వీడ్కోలు…

* రైతు బాంధవుడికి అశ్రు నివాళి

* ఆంధ్రా, తెలంగాణా నేతలు సంతాపం

* ఉద్యమ ప్రస్థానం స్ఫూర్తిదాయకం

* వామపక్ష పార్టీల ఐక్యతకు పిలుపు

విజ‌య‌వాడ, సెల్ఐటి న్యూస్‌: రైతు బాంధవుడు, భూపోరాట యోధుడు, సీపీఐ సీనియర్ నేత *కొల్లి నాగేశ్వరరావు* ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శనీయమని పలు రాజకీయ శ్రేణులు, అభ్యుదయవాదులు, రైతు. ప్రజా సంఘాల ప్రతినిధులు కొనియాడారు. కామ్రేడ్ కొల్లి నాగేశ్వరరావు భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణుల సందర్శనార్ధం శుక్రవారం ఉదయం విజయవాడ విశాలాంధ్ర చంద్రం బిల్డింగ్స్ జవరణలో ఉంచాడు. అయన భౌతిక కాయానికి ఇంద్రా, తెలంగాణా రాష్ట్రానికి చెందిన వివిధ పార్టీల శ్రేణులు, రైతు సంఘాల ఉద్యమ సారధులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, అభ్యుదయవాదులు, వైద్యులు, ప్రముఖులు నివాళులర్పించారు, కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయనతో ఉన్న సన్నిహిత సంబంధాన్ని గుర్తుచేసుకుని విప్లవ జోహార్లు అర్పించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, తెలంగాణా రాష్ట్ర సిపిఐ సహాయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, తెలంగాణా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, సీపీఐ సీనియర్ నేత ఈడ్పుగంటి నాగేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముష్పార్ల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ సమ్మర్ జల్లి విల్సన్, రావుల వెంకయ్య, పి.హరినాథరెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కె. సుబ్బరాజు, విశాలాంధ్ర సంపాదకులు ముత్యాల ప్రసాద్, డీజీఎం.మనోహర్ నాయుడు, పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, సీపీఆ(ఎంఎల్) రాష్ట్ర నాయకులు ముప్పాళ్ల భార్గవ, సీపీ(అనిల్)-లిబరేషన్ నాయకులు ఈశ్వర్, ఏపీ రైతు సంఘం నాయకులు వై.కేశవరావు, వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతమ్‌రెడ్డి, టీడీపీ నాయకులు కాట్రగడ్డ బాబు, బీజేపీ రైతు విభాగం జాతీయ నాయకులు గోపాలకృష్ణ, కృష్ణాజిల్లా సీపీజ కార్యదర్శి అక్కినేని వడ, సహాయ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, ఏబట యూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు చలసాని వెంకట రామారావు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డి.లక్ష్మీనారాయణ తదితరులు తిత్లి నాగేశ్వరరావుకు నివాళులర్పించారు. కాని నాగేశ్వరరావు స్వగ్రామమైన కృష్ణాజిల్లా నూజివీడు సమీపంలోని గుడివాడ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చి ఆయనకు విప్లవ జోహార్లు అరౌంచారు. అనంతపురం జిల్లా నాగేశ్వరరావు భౌతికకాయాన్ని కృష్ణలంక స్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనకు కారు కన్నీటి వీడ్కోలు పలికారు. తొలుత రావుల వెంకయ్య అధ్యక్షతన పలువురు నేతలు ప్రసంగించి, కొల్లితో ఉన్న ఉద్యమ అనుబంధాన్ని వివరించారు.
సీపీఐ రాష్ట్ర కె.రామకృష్ణ మాట్లాడుతూ ఒక సమస్యను పరిష్కరించేంత వరకు పోరాడే దీరుడుగా కొల్లికి పేరుందన్నారు. నిస్వార్థంగా పనిచేసే అరుదైన రాజకీయ నేతల్లో ఆయన ఒకరుగా నిలిచారని చెప్పారు. జిల్లా, రాష్ట్ర దేశ స్థాయి రైతాంగ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కిందని, పనిచేసే వారిని చెక్కు తట్టి ప్రోత్సహించడమే ఆయన శైలి అని పేర్కొన్నారు. కమ్యూనిస్టు, రైతాంగ ఉద్యమాలకు నాగేశ్వరరావు సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టు నేతలుగా పనిచేసి, వృద్ధాప్యంతో బాధపడుతున్న వారందర్నీ ఇటీవల ఫోన్ ద్వారా తాను పరామర్శించారు గుర్తుచేశారు. పి.మధు మాట్లాడుతూ నాగేశ్వరరావు తన యావత్తు జీవితాన్ని కమ్యూనిస్టు ఉద్యమానికి, ఐక్యతకు కృషి చేశారన్నారు. 20ఏళ్లుగా గ్లోబలైజేషన్ ప్రభావంతో గ్రామాలకు పెట్టుబడిదారుల మురా చేరిందని చెప్పారు. గ్రామాల్లో విషయాల్లోనూ నలుగురితో కూడిన పెట్టుబడి దారీ మురారే పైచేయిగా నిలుస్తోందన్నారు. ఈ తరుణంలో వామపక్ష పార్టీల జక్క అవసరమన్నారు. పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి కాలితో ఉన్న పరిచయాలను, ఉద్యమాలను గుర్తు తెచ్చుకున్నారు. సుదీర్ఘ ఉద్యమ ప్రయాణం గల నేత మృతి తీవ్రంగా కలత చెందానన్నారు. ఒక సమస్యపై వెనుతిరగకుండా పోరాడే వారని చెప్పారు. ఆయన ఉద్యమాలు, ఆలోచనలు, పయనం ఆదర్శనీయమని అన్నారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ నిరంతరం ఉద్యమాలే ఊపిరిగా ఆయన పయనం కొనసాగిందన్నారు. గాని అనుసరించిన మార్గంలో వామపక్ష, ప్రజాతంత్ర వాడు పయనించాల్సిన అవసరముందన్నారు. ఆయనతో కలిసి ఉద్యనూల్ లో పనిచేసే అవకాశం దక్కురం నాకు గర్వకారణమని చెప్పారు. పశ్య వర్మ మాట్లాడుతూ కొల్లి మరణం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని రైతు లోకానికి, ప్రజాస్వామిక వాదులకు, ప్రజాతంత్ర శక్తులకు దిగ్ర్భాంతి కలిగించిందన్నారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆయన యువ దశ ఉద్యమం ప్రారంభమైందని వివరించారు. మాన్సెంలో కు పత్తి విత్తనం ధరలపై సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం చేసి, విజయం సాధించారని, రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచారన్నారు. ఒక కమ్యూనిస్టు ఎలా జీవించాలనే దానికి ఈయన జీవితం మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈడ్పుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ వత్తి రీత్యా కొల్లి ఇంజినీర్ చదవకపోయినా, నీటి పారుదల ప్రాజెక్టులు, వ్యవసాయ రంగాలపై ఆయన సమగ్రంగా అధ్యయనం చేశారన్నారు. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కమ్యూనిస్టు, రైతాంగ ఉద్యమాలకు కృషి చేశారని కొనియాడారు. విద్యార్థి దశ నుంచి సమాజంలో ఏదైనా చిన్న మార్పు తేజాలు తపనతో ఆయన ఆలోచనలు కొనసాగాయని వివరించారు. ఒక ప్రభావశీలమైన వ్యక్తి రైతాంగ, వ్యవసాయ రంగాలపై ఆయన పరిశీలన కొనసాగించారని గుర్తుచేశారు.
ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయన జీవితమంతా ఆలోచన, ధ్యాస శ్వాస అంతా ఉద్యమ భావాలతోనే పోరాడిన గొప్ప వీరుడని కొనియాడారు, నేను అభిమానించే నాయకుల్లో కొల్లి ఒకరని, ఆయన మృతికి విప్లవ జోహార్లు అర్పించారు. ఉద్యమమే ఊపిరిగా, అహోరాత్రులు శ్రమించిన గొప్ప ఆదర్శ కమ్యూనిస్టు కొల్లి అని అభివర్ణించారు. రైతాంగ, ఇరిగేషన్ వ్యాధికి తన జీవితాన్ని అంకితం చేసిన రైతు బాంధవుడు చెప్పారు. జల్లి విల్సన్ మాట్లాడుతూ కృష్ణా గోదావరి జలాల సమస్య తెలంగాణా రైతాంగ సమస్యల పరిష్కారంలో ఆయన ఉద్యమ పయనం మరువలేనిదన్నారు. పార్టీ కార్యకర్తలను, నాయకులను తీర్చిదిద్దడంలో తనదైన పాత్ర పోషించారన్నారు. పార్టీ నిర్మాణం, ప్రజా సంఘాల బలోపేతానికి అలుపెరగని కృషి చేశారన్నారు రావుల, వెంకయ్య మాట్లాడుతూ కొల్లి రాసిన జలదర్శన్ పుస్తకానికి వాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డితోపాటు పలువురు నీటిపారుదల రంగ ఇంటినీర్లు, నిపుణులు కిశా బిచ్చారన్నారు. రైతు సమస్యల పరిష్కారంపై నిరంతరం పోరాడిన యోధుడని కొనియాడారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ నీతి, నిజాయితీ కి నిలువెత్తు సాక్ష్యంగా దశాబ్దాలపాటు కొల్లి ఉద్యము పయనం కొనసాగుతుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జలదర్శన్ పుస్తకం రా మంచి పేరు, ప్రఖ్యాతలు పొందారన్నారు. రాజకీయాలకు అతీతంగా వీటి పత్తి విత్తనాలపై ఆయన చేసిన న్యాయపోరాటం చరిత్ర పుటల్లో నిలిచిపోతుందని చెప్పారు. కేశవరావు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి కాల్ కుటుంబంతో త‌న‌కు పరిచయముందని వివరించారు. కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ తిత్లి జీవితమంతా నిరంతరంగా కొనసాగిందని, ప్రతి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉద్యమించే వారన్నారు. ముప్పాళ్ల భార్గవ మాట్లాడుతూ చివరి వరకు కొల్లి ఆశయాల సాధన కోసం పనిచేశారన్నారు. కమ్యూనిస్టు శక్తుల మధ్య ఐక్యతకు నాటి నుంచి ఆయన ప్రయత్నిస్తున్నారని, ఆయన ఆశయ సాధన కోసం మనం ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. గోపాలకృష్ణ మాట్లాడుతూ కొల్లి జీవితం నేటి ఉద్యమకారులకు ఆదర్శంగా నిలిచిందని, మార్చి, సోషలిజం భావజాలంతో ముందుకు సాగడమే మనం ఆయనకిచ్చిన ఘనమైన నివాళి అని చెప్పారు. కె.సుబ్బారావు మాట్లాడుతూ రైతాంగం కోసం ఆయన జీవితాన్ని ధారపోశారని పేర్కొన్నారు. అక్కినేని వనజ మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో పలు భూపోరాటాలు, రైతాంగ ఉద్యమాల్లో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. కాని రాసిన జలదర్శన్ పుస్తక్ భవిష్యత్ తరాలకు విజ్ఞానదాయకంగా నడుస్తుందన్నారు. తిత్లి తమ ఆచార్యులు కొనియాడారు. ఏఐఎస్ఎఫ్ నాయకుడుగా తాము కొనసాగామ‌న్నారు. దోనేపూడి శంకర్ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమంలో రోజుల్లో తమకు క్రమశిక్షణ, ఉద్యమ స్ఫూర్తిని ఆయన బోధించారని గుర్తుచేశారు. డి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కొల్లి నాగేశ్వరరావు శాలిక కాయాన్ని సందర్భంగా నివాళులర్పించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. నూజివీడు పరియా సీపీఐ నాయకులు కొమ్మన నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు బాంధవుడుగా కొల్లి నిలిచారన్నారు. నాగేశ్వరరావు భౌతిక కాయానికి ఏజ్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాధ్, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మి.దుర్గాభవాని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి వి. సుందరరామరాజు, సీపీఐ రాష్ట్ర నాయకులు వి.చెంచయ్య, ఏపీ ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.చంద్ర నాయక్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవీ రావు, ప్రొఫెసర్ సి.నరసింహారావు, ప్రోగ్రెసివ్ ఫోరమ్ రాష్ట్ర నాయకులు అక్కినేని చంద్రారావు, బుడ్డిగా జమీందార్, డాక్టర్ వి. రామప్రసారకు నివాడు అర్పించారు. రైతు సంఘం కృష్ణాజిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెలగపూడి ఆజాద్, మళ్ళీ యలమండరావు, ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు రాష్ట్ర నాయకులు షాన్ బాబు, ది రవి, విశాలాంధ్ర మేనేజర్ సూర్యనారాయణ, అరసం జిల్లా అధ్యక్షులు కొండపల్లి మాధవరావు, సహాయ కార్యదర్శి మోతుకూరి అరుణ కుమార్, శ్రామిక మహి ఫోరమ్ కార్యదర్శి డాక్టర్ జి.సుజాత, డాక్టర్ ఓ శైలజారాణి, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, చుక్కపల్లి తిరుమలరావు, ఏపీ చేతి వృత్తిదారుల సంఘం రాష్ట్ర నాయకులు రొయ్యూరు ఆదిశేషారావు, ఆర్.పిచ్చయ్య రాష్ట్ర, జిల్లా, నగరాలకు చెందిన వివిధ పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాల ప్రతినిధులు శ్రద్ధాంజలి ఘటించారు.

     

Just In...