Published On: Sat, Mar 16th, 2019

కొల్లేరు స‌ర‌స్సు ప్ర‌కృతి ప్ర‌సాదించిన వ‌రం

* కాపాడుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంది

* వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మావేశంలో కృష్ణా క‌లెక్ట‌ర్ ఎ.ఎండి.ఇంతియాజ్‌

సెల్ఐటి న్యూస్‌, మ‌చిలీప‌ట్నం: కొల్లేరు పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఎఎండి ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. ఈ స‌ద‌ర్భంగా శనివారం కలక్టరేట్‌లో రెవెన్యూ, అటవీ, డ్రైనేజి తదితర శాఖల అధికారులతో ఆయ‌న సమావేశం నిర్వహించి కొల్లేరు పరిరక్షణకై తీసుకోవాల‌ల్సిన చర్యలపై చర్చించారు. అనంత‌రం కలెక్టర్ ఇంతియాజ్  మాట్లాడుతూ సహజసిద్దమైన కొల్లేరు సరస్సు ప్రకృతి ప్రసాదించిన వరం అని.. దానిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొల్లేరు సరస్సు మొత్తం 17వేల ఎకరాల్లో విస్తరించి ఉందని కృష్ణాజిల్లాలో కైకలూరు, మండవల్లి మండలాల్లో 31 వేల ఎకరాల్లో కొల్లేరు ఉందని, పశ్చిమ గోదావరి జిల్లాలో 7 మండలాల్లో విస్తరించి ఉందని తెలిపారు. బుడమేరు, ఉప్పుటేరు వంటి నాలుగు ప్రధాన నీటి వనరులు ఉన్నాయన్నారు. కృష్ణాజిల్లాలో విస్తరించి ఉన్న కొల్లేరులో ఎప్పుడు నీరు ఉంటుందని ఫెలికాన్ పక్షులు సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి మాసం వరకు వస్తాయని అందులో భాగంగా ఈ ఏడాది 10 వేల వరకు వచ్చాయని అన్నారు. ముఖ్యంగా కొల్లేరు ఏరియాలో అనధికార ఆక్రమణాలు బ్యాక్ వాటర్ వల్ల సెలినీటి సమస్యలు నివారణ చర్యలు చేపట్టాలని, సంబంధిత మండల తహసిల్దార్లు వారి పరిధిలో కొల్లేరును త‌నిఖీ చేసి ఆక్రమణాలు జరగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుద‌ని పక్షులు రావడం లేదని ప‌త్రిక‌ల్లో క‌థ‌నాలు వస్తున్నాయని కావున తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. ప‌లుచోట్ల చెత్త డంపింగ్ వల్ల ప్లాస్టిక్ కారణంగా సమతుల్యత దెబ్బతింటుందని వెంట‌నే నివారణ చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో గుడివాడ ఆర్డీవో జి.సత్యవాణి, కైకలూరు రేంజ్ అటవీ అధికారి కె.విజయ, సర్వేశాఖ ఎడి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Just In...