Published On: Tue, Jul 2nd, 2019

కోటేశ్వరమ్మ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: మహిళా విద్యకు మాంటిస్సోరి విద్యా సంస్థల అధినేత్రి కోటేశ్వరమ్మ మార్గదర్శిగా నిలిచారని ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. విజయవాడలోని లబ్బీపేటలో  కోటేశ్వరమ్మ భౌతికకాయానికి మంగ‌ళ‌వారం ఆయన నివాళులర్పించారు. కోటేశ్వరమ్మ లేని లోటు తీర్చలేనిదని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. కోటేశ్వరమ్మ అందరికీ ఓ స్పూర్తిదాయకమైన వ్యక్తి అని, అర్థవంతమైన జీవితం గడిపారని చంద్రబాబు పేర్కొన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి, ఉపాధ్యాయురాలిగా జీవనాన్ని ప్రారంభించి కోటేశ్వరమ్మ.. కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలను నెలకొల్పడం అభినందనీయమన్నారు. మహిళా సాధికారత కోసం ఆమె ఎంతగానో కృషి చేశారని చంద్రబాబు తెలిపారు. మహిళల అభ్యన్నతికి ఆమె పాటుపడ్డారని తానంటే ఆమెకు చాలా అభిమానమని, ఆప్యాయంగా పలకరించే వారని గుర్తు చేసుకున్నారు. కోటేశ్వరమ్మ సంతానంతో పాటు మాంటిస్సోరిలో చదివిన ఎంతో మంది ఉన్నత స్థానాలలో నిలిచారని చంద్రబాబు పేర్కొన్నారు.

Just In...