Published On: Tue, Mar 17th, 2020

కోడికూర.. చిల్లుగారె…!

* కృష్ణాజిల్లాలో రూ.30కే కోళ్ల విక్ర‌యాలు

* చికెన్ విక్ర‌యాల‌పై క‌రోనా వైర‌స్ తీవ్ర‌ప్ర‌భావం

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందన్న పుకార్లతో రాష్ట్రంలో ని చికెన్ వ్యాపారులు తీవ్రంగా నష్ట పోతున్నారు.. పౌల్ట్రీ వ్యాపారులు కోళ్లను మేపలేక ఒక కోడి కొంటే మరోకోడి ఉచిత మంటూ ప్రచారం చేస్తున్నారు.. ఇటీవల కృష్ణా జిల్లా మైలవరం లో ఓ పౌల్ట్రీ వ్యాపారి 30 రూపాయల కే కోడిని అమ్ముతూ నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేశారు.. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నం గూడూరు మండలంలో చికెన్ పై అవగాహన కల్పించేందుకు వ్యాపారులు విన్నూత్న ప్రయత్నం చేశారు. గండ్రమ్ గ్రామంలో ఆర్జేడీ, సాయిగణేష్ చికెన్ సెంటర్ నిర్వహకులు గ్రామంలో ఇంటింటికి కిలో చికెన్‌ను ఉచితంగా పంపిణీ చేశారు. మ‌రో వ్యాపారి ఒకడుగు ముందుకేసి వండిన చికెన్ కూర, గారెలను గ్రామస్థులకు పంపిణీ చేశారు.. కరోనా వైరస్ కు చికెన్‌కు ఎటువంటి సంబంధం లేదంటూ ప్రజలకు అవగాహన కల్పించారు. చికెన్, కోడి గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన లేఖను కరపత్రాల ద్వారా అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం చికెన్ పై మరింత అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని చికెన్ వ్యాపారులు కోరుతున్నారు.

Just In...