Published On: Wed, Sep 18th, 2019

కోడెల అంత్యక్రియలు పూర్తి.. శివరామ్ కన్నీరుమున్నీరు..

* నరసరావుపేటలోని స్వర్గపురిలో తండ్రి చితికి నిప్పంటించిన కొడుకు శివరామ్

* కన్నీరుమున్నీరైన కోడెల కుటుంబసభ్యులు, పార్టీ నేతలు, అభిమానులు

సెల్ఐటి న్యూస్‌, న‌ర‌స‌రావుపేట‌: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు బుధ‌వారం సాయంత్రం అశేష అభిమానులు, పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల క‌న్నీటిసంద్రం న‌డుమ ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు నిర్వహించారు. కోడెల చితికి ఆయన తనయుడు శివరామ్ నిప్పంటించారు. తండ్రి మృతదేహానికి కొరివి పెడుతూ శివరామ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. కోడెల అంత్యక్రియల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు పాల్గొన్నారు. దారిపొడ‌వునా అభిమానులు వేలాదిగా త‌ర‌లివ‌చ్చి కోడెలకు కన్నీటి వీడ్కోలు పలికారు.

Just In...