Published On: Mon, Sep 16th, 2019

కోడెల మృతిప‌ట్ల గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ సంతాప సందేశం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఏపి శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు అకాల మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిస్వభూషన్ హరిచందన్ సోమ‌వారం ఒక సందేశంలో సంతాపం తెలిపారు. శివప్రసాదరావు ఎమ్మెల్యేగా ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారని, ప్రజలకు అంకిత భావంతో సేవ చేసారని ప్రస్తుతించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్‌గా శివప్రసాదరావు చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుండిపోతాయని గవర్నర్ తెలిపారు. శివప్రసాద్ కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాడ సానుభూతిని, హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు.

Just In...