Published On: Mon, Nov 18th, 2019

కోడే యామినికి విశిష్ట జాతీయ ప్రతిభ పురస్కారం

సెల్ఐటి న్యూస్‌, గ‌న్న‌వ‌రం: కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెం గ్రామానికి చెందిన ప్రముఖ రచయిత్రి కోడే యామిని దేవికి విశిష్ట జాతీయ ప్రతిభా పురస్కారంతో ఘన సన్మానం జరిగింది. ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆదరణాలయం మరియు వేదిక క్రియేటివిటీ కల్చరల్ టాలెంట్ మరియు వేరియస్ స్కిల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ విశిష్ట ప్రతిభ పురస్కార ప్రదానోత్సవం 2019లో పలువురు ఆమెను సాహిత్య రంగంలో జాతీయ విశిష్ట ప్రతిభ పురస్కారం తో ఘనంగా సత్కరించారు. ఏలూరులోని ఎంహెచ్ హాలులో నిర్వహించిన ఈ పురస్కార ప్రదాన సభకు అభ్యుదయ కవి ఎడవల్లి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కోడే యామిని దేవి తన మినీ కవితలలో సామాజిక సమస్యలను, ఎంతో లోతైన భావాలను తన సాహిత్యంలో ప్రతిభింబిస్తుంది అని కొనియాడారు. నిర్వాహకులు ఇతర ప్రముఖులు ఆమెకు శాలువా జ్ఞాపిక బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాల నటి సాయి హన్సిక, అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ తురగా సూర్యారావు, యామిజాల నరసింహమూర్తి, ఎండ్రాతి మల్లేశ్వరరావు తదితర ప్రముఖులు పాల్గొనగా వేదిక సీసీటీవీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నరేంద్ర ఆరవల్లి సభా నిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా యామినీ దేవి మాట్లాడుతూ ఈ పురస్కారం లభించటం ఎంతో ఆనందంగా ఉందని, రచయిత్రిగా తన భాద్యత మరింత పెరిగిందన్నారు. సంస్థ నిర్వాహకులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

Just In...