Published On: Tue, Apr 17th, 2018

కోనేటిరాయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ కవచ ప్రతిష్ఠ

* ఈ నెల 18 నుంచి మూడు రోజుల‌పాటు ఘ‌నంగా ప్ర‌తిష్ట మ‌హోత్స‌వం

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామివారి ఆలయంలో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ధ్వజస్తంభ కవచ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరుగనుంది. ఈ కార్య‌క్రామ‌నికి ఈ నెల 17న అంకురార్పణ నిర్వహిస్తారు. 18న ఉదయం అకల్మష హోమం, రక్షాబంధనం, పంచగవ్య ప్రాసనం, సాయంత్రం కుంభం బింబం యాగశాల  ప్రవేశం, అగ్నిప్రతిష్ఠ హోమం నిర్వహిస్తారు. 19న ఉదయం వాస్తు శాంతి, నిత్యహోమం సాయంత్రం పంచకవరాదివాసం, 20న ఉదయం క్షీరాధివాసం హోమాలు, సాయంత్రం జలాధివాస హోమాలు చేపడతారు. 21న ఉదయం మహాశాంతి హోమం, సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. 22న ఆదివారం ఉదయం 7.30 నుంచి 9 గంటల నడుమ వృషభ లగ్నంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవం చేపడతారు. ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి, కుంభం బింబం ఆలయ ప్రవేశం నిర్వహిస్తారు. ఈ ఉత్సవ ఏర్పాట్లను శ్రీనివాసమంగాపురం ఆలయ డిప్యూటీ ఈవో వెంకటయ్య పర్యవేక్షిస్తున్నారు.

Just In...