Published On: Tue, Mar 12th, 2019

కోరాడ‌కు బంజారాల మ‌ద్ద‌తు…

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ (పాత‌బ‌స్తీ): సేవాభావం క‌ల్గిన వారితోనే త‌మ ప‌య‌నం అంటూ 30వ డివిజ‌న్ లంబాడీపేట‌కు చెందిన బంజారా (లంబాడి) సామాజికవ‌ర్గానికి చెందిన మ‌హిళ‌లు కోరాడ ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ కోరాడ విజ‌య్‌కుమార్‌కు మ‌ద్ద‌తు తెలిపారు. నాయ‌కులు క‌ట్టా స‌త్తి, బి.శ్రీను నాయ‌క్‌, డి.దిలీప్ నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో వంద మంది బంజారా మ‌హిళ‌లు మంగ‌ళ‌వారం ఉద‌యం పాత‌బ‌స్తీలోని జెండాచెట్టు వ‌ద్ద ఉన్న కోరాడ విజ‌య్‌కుమార్ కార్యాల‌యానికి వ‌చ్చి ఆయ‌న‌కు త‌మ సంఘీభావం తెలిపారు. ఈసంద‌ర్భంగా ప‌లువురు బంజారా మ‌హిళ‌లు మాట్లాడుతూ ఎంతో వెనుక‌బ‌డిన వ‌ర్గానికి చెందిన త‌మ సమ‌స్య‌ల‌ను వినేందుకు కూడా ఇప్ప‌టివ‌ర‌కు ఏ నాయ‌కుడు చొర‌వ చూప‌ని స‌మ‌యంలో విజ‌య్‌కుమార్ వంటి నాయ‌కుడు ముందుకు వ‌చ్చి తాము ఎదుర్కొంటున్న ప‌లు ఇబ్బందుల‌ను తెలుసుకున్నార‌ని పేర్కొన్నారు. ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తార‌న్న కోరాడ విజ‌య్‌కుమార్ మాట‌లు త‌మ సామాజిక వ‌ర్గం విశ్వ‌సిస్తుంద‌ని తెలిపారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు అండ‌గా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఎస్సీ, ఎస్టీ నాయ‌కులు పాల్గొన్నారు.

Just In...