Published On: Sat, Feb 23rd, 2019

కోరుకున్న గమ్యం చేరడానికి రెండు ప్రయాణ టికెట్ల లింకింగ్‌ సదుపాయం

* ఏప్రిల్ 1 నుండి అమలు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: రైల్వే ప్రయాణికుల‌కు ప్రయోజనం చేకూర్చేందుకు ముఖ్యంగా దూరప్రాంతాల‌కు కనెక్టింగ్‌ రైళ్ళలో వెళ్ళే ప్రయాణిల‌ సౌకర్యార్ధం రైల్వే మంత్రిత్వ శాఖ రెండు టికెట్ల లింకింగ్‌ సదుపాయాన్ని ప్రవేశపెడుతోంది. రెండు ప్రయాణాల‌ను లింకింగ్‌ చేసే విధానం ద్వారా  డైరెక్ట్ బెర్తు లేనప్పుడు దూరప్రాంత ప్రయాణికులు తాము అనుకున్న గమ్యాన్ని చేరడానికి రెండు ప్రయాణాల‌ టికెట్లను లింకింగ్‌ చేసే సదుపాయం క‌లిగిస్తుంది. ఈ సదుపాయం ఏప్రిల్‌ 1 నుండి అమల‌వుతుంది. భారతీయ రైల్వే ప్రతిరోజూ 12 ల‌క్షల‌ ప్రయాణికుకు రిజర్వేషన్‌ కల్పిస్తూ గమ్యాల‌కు చేరవేస్తుంది. పిఆర్‌ఎస్‌గా అందరికీ తెలిసిన ఇండియన్‌ రైల్వే ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ ప్రతిరోజూ టికెట్ల రిజర్వేషన్‌ మరియు క్యాన్సిలేషన్లు చేసే అతిపెద్ద నెట్‌వర్క్‌ సిస్టమ్‌. 64% కంటే ఎక్కువగా టికెట్లు ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో జరుగుతుంటాయి. మిగిలిన టికెట్లు పిఆర్‌ఎస్‌/వైటిఎస్‌కె (యాత్రి టికెట్‌ సువిధ కేంద్ర)/ కరెంట్‌ బుకింగ్‌ కౌంటర్ల ద్వారా దేశంలోని వివిధ స్టేషన్లు / స్థలాల్లో కొనుగోు చేయబడతాయి. తాము చేరవసిన గమ్యాకు డైరెక్ట్ బెర్తు లేని దూరప్రాంత ప్రయాణిల‌కు, సాధార‌ణంగా ఒకటికంటె ఎక్కువ రైళ్ళకు టికెట్లు బుక్‌ చేసుకొని ప్రయాణం కోసం ప్రణాళిక వేసుకొంటారు. ఆ ప్రయాణంలో వారు మరో జంక్షన్‌లో అనుకూల‌మైన మరో బెర్తు అందుకోవడానికి మధ్య కావాల్సినంత ఖాళీ సమయం ఉండేలా చూసుకొంటారు. కాని, కొన్ని సమయాలో మొదటి ప్రయాణ రైళ్ళు ఆస్యంగా నడవడం వ‌ల్ల కనెక్టింగ్ బెర్తు అందుకోలేకపోతుంటారు. అప్పుడు ప్రయాణికు తాము మిస్సయిన తర్వాతి బెర్తు ప్రయాణ టికెట్ల రద్దు కోసం సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. టికెట్ల రద్దులో ఇలాంటి సమస్యను అధిగమించడానికి, రైల్వే మంత్రిత్వశాఖ ప్రస్తుతం రెండు ప్రయాణ టికెట్లను లింకింగ్‌ చేసే సదుపాయం కల్పించడానికి నిర్ణయించింది. ఈ సదుపాయం రెండు పిఆర్‌ఎస్‌ కౌంటర్లకు ఆన్‌లైన్‌లో విస్తరించబడుతుంది.
‘‘దూరప్రాంత ప్రయాణికులు తాము అనుకున్న కనెక్టింగ్ రైలును అందుకోలేకపోతే పూర్తి చేసిన ప్రయాణ ఛార్జీని మినహాయించి ప్రయాణించని భాగం టికెట్ ధర ఎలాంటి టెలిస్కోపిక్‌ బెనిఫిట్‌ లేకుండా కేన్సిలేషన్‌ చార్జీను మినహాయించకుండా పూర్తిగా రిఫండ్‌ చేస్తారు. పిఆర్‌ఎస్‌ కేంద్రా ద్వారా గాని, ఆన్‌లైన్‌లో గాని లేదా రెండు విధా సంయుక్తంగా గాని కొనుగోు చేసిన టికెట్లకు పిఎన్‌ఆర్‌ను లికింగ్‌ చేసే ఈ సౌకర్యం కల్పించబడుతుంది. ఈ కొత్త సదుపాయం ఏప్రిల్‌ 1 నుండి అమ‌లు చేయడం జరుగుతుంది. ఇలాంటి టెకెట్ల రిఫండ్‌ కోసం తాము ప్రయాణించిన బెర్తు ఆ జంక్షన్‌కు చేరిన సమయం నుండి 3 గంటలోగా ధరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రైలు ప్రయాణ టికెట్లు ఇతర ప్రయాణ సాధనా టికెట్ల ధరలో పోల్చి చూస్తే చాలా చవక. దీనికి తోడు కనెక్టింగ్‌ ప్రయాణాలో డైరెక్ట్ రైలు లేని దూర ప్రాంత ప్రయాణికుల‌కు పిఎన్‌ఆర్‌ లింకింగ్‌ సదుపాయం తప్పకుండా ఒక వరమని చెప్పవచ్చు.

Just In...