Published On: Sun, Jul 12th, 2020

కోవిడ్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి ఆళ్ల నాని

ఏలూరు, సెల్ఐటి న్యూస్‌: ఏలూరులోని కోవిడ్ ఆసుపత్రిని మంత్రి ఆళ్ల నాని సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితులను ఆయన శ‌నివారం స్వయంగా పరిశీలించారు. కోవిడ్ బాధితులకు అందుతున్న ఆహారం, వైద్య సదుపాయాలపై మంత్రి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కొన్ని కారణాల వలన కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, రోగులకు అందిస్తున్న ఆహారం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ బాధితులను డిశ్చార్జ్ చేసేముందు యాంటీజెన్ టెస్టులు చేస్తున్నామని తెలిపారు. కోవిడ్ టెస్టులు చేసేందుకు ప్రతి జిల్లాకు నాలుగు సంజీవిని బస్సులు ఏర్పాటు చేస్తున్నామని నాని తెలిపారు.

Just In...