కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అపోహాలు వద్దు…
* వ్యాక్సిన్ వేయించుకున్న నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ నగరపాలక సంస్థ, సెల్ఐటి న్యూస్: కోవిడ్ వ్యాక్సినేషన్‌పై ఏ విధమైన అపోహలకు పోకుండా క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది వారి యొక్క అభీష్టం మేరకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగ పరచుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ జి.గీతాభాయి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నగరపాలక సంస్థ అధికారులు, క్షేత్ర స్థాయిలో సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ వేసే కార్యక్రమాన్ని కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం ప్రారంభించారు. ముందుగా కోవిడ్ వ్యాక్సినేషన్ యొక్క ప్రాధాన్యతను కమిషనర్ వివరించారు. విధి నిర్వహణలో ఉన్న ఫ్రెంట్ లైన్ ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం ఉందని, వివిధ పనులకు ప్రతి నిత్యం ప్రజలతో కలసి పని చేస్తుంటారని, మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు అందరు ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మీరు కోవిడ్ నుండి రక్షణ పొంది ఉండాలని, తీవ్రమైన ఆరోగ్య కారణాలు ఉన్నవారు కాకుండా మిగిలిన వారు తమ అభీష్టం మేరకు వ్యాక్సినేషన్ వేయించుకొని రక్షణ పొందాలన్నారు. కార్యక్రమంలో ప్రధమంగా కమిషనర్ ప్రసన్న వెంకటేష్ వ్యాక్సినేషన్ వేయించుకోగా చీఫ్ ఇంజనీర్ ప్రభాకరరావు, ఎస్ఇలు నరశింహమూర్తి, శ్రీరామమూర్తి, సిటి ప్లానర్ లక్ష్మణరావు, ప్రాజెక్ట్ ఆఫీసర్ డా.జ్యోతి, ఎ.డి.హెచ్ జ్యోతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఇతర క్షేత్ర స్థాయి సిబ్బంది మొత్తం 107 మందికి వ్యాక్సినేషన్ వేయించుకున్నారు.