Published On: Wed, Dec 4th, 2019

క్రికెట్ బెట్టింగ్ నిర్వాహ‌కుల ఆట‌క‌ట్టు..

* న‌లుగురు అరెస్టు, రూ.16ల‌క్ష‌లు న‌గ‌దు స్వాధీనం

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ క్రైం: క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేయ‌డంతో పాటు వారి నుండి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న సామాగ్రితో పాటు రూ.16.2 లక్షలు నగదును విజ‌య‌వాడ టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధ‌వారం స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ అనే వ్యసనం ద్వారా అనేక మంది వ్యక్తులు ముఖ్యంగా యువత క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతూ ఆర్ధికంగా నష్టపోతూ విలువైన సమయాన్ని మరియు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో విజయవాడ నగరంలోని పరిసర ప్రాంతాలలో జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ పై నగర పోలీస్ కమీషనర్ సి.హెచ్.ద్వారకా తిరుమలరావు ఆదేశాలపై ప్రత్యేక చర్యలు చేపట్టి టాస్క్ ఫోర్సు ఏడిసిపి కె.వి.శ్రీనివాసరావు, ఏసిపి వి.ఎస్.ఎన్.వర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక దృష్టి సారించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న శిబిరంపై దాడులు నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా చేసుకుని విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుతీనగర్, మసీద్ వీధిలోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని చట్ట వ్యతిరేఖంగా నగదును పెట్టి క్రికెట్ బెట్టింగా నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్సు పోలీసులు దాడి చేయగా సదరు ఇంటిలో నలుగురు వ్యక్తులను అధుపులోకి తీసుకోవడం జరిగింది. నిందితుల వివరాలు: 1) విజయవాడ, మసీద్ వీధికి చెందిన పైలా ప్రసాద్(33) 2) పశ్చమగోదావరి జిల్లా, కైకారంకు చెందిన సిరిబత్తుల కళ్యాన్ చక్రవర్తి(37) 3) విజయవాడ, మొగల్ రాజ్ పురానికి చెందిన మాదేటి మోహన్ కృష్ణ(37) 4) విజయవాడ, కృష్ణలంకకు చెందిన ఉండి శరత్ చంద్ర(25) క్రికెట్ బెట్టింగ్ న్విహించడానికి ఉపయోగించిన సామాగ్రి: 1) క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే 20 సెల్ ఫోన్ బాక్స్ 2) వీడియోకాన్ టి.వి 3) ల్యాప్ ట్యా బ్లు -2 4) సెల్ ఫోన్లు-19 మరియు రూ. 16 లక్షల 2 వేలు నగదు స్వాధీనం. పై నిందితులలో ప్రధాన నిందితుడు అయిన పైలా ప్రసాద్ తన స్నేహితుడు అయిన సిరిబత్తుల కళ్యాన్ చక్రవర్తి ద్వారా క్రికెట్ బెట్టింగ్ బోర్డును నిర్వహించుట ద్వారా అధిక మొత్తంలో నగదు సంపాదించవచుననే ఉద్దేశ్యంతో చక్రవర్తికి తనకు గతంలో అనుభవం ఉన్నటువంటి క్రికెట్ బెట్టింగ్ ను గురించి పైలా ప్రసాద్ కు చెప్పడంతో వీరిద్దరూ కలసి సదరు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించడానికి ఉపయోగించు సెల్ ఫోన్ బాక్సు కల్గిన బోర్డును విజయవాడ తీసుకుని వచ్చి మరుతీనగర్ లోని, మసీదు వీధిలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని వీరిద్దరు బుకీలుగా ఉండి క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించిన బోర్డు సహాయంతో టీ.వీని చూస్తూ ఫోన్ ద్వారా సంబాషణ జరుపుతూ క్రికెట్ మ్యాచ్ కు బెట్టింగ్ నిర్వహిస్తూ వీరితో మాదేటి కృష్ణ మరియు ఉండి శరత్ చంద్ర అను వారిని ఫంటర్లగా పెట్టి వారి సహాయంతో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాట్లు వెల్లడి కావడంతో వారిని అధుపులోకి తీసుకుని క్రికెట్ బెట్టింగ్ కు వినియోగిస్తున్న సామాగ్రిని మరియు రూ.16 లక్షల 2 వేలు నగదును స్వాధీనం చేసుకోవడం జరిగింది. రాజధాని అమరావతి ప్రాంతముతో ప్రశాంతతకు భంగం కలిగే విధంగా ఎటు వంటి అసాంఘిక కార్య క్రమాలకు అవకాశం ఇవ్వ కుండా విజయవాడను నేరరహిత నగరంగా తీర్చి దిద్దేందుకు సీపీ ద్వారకా తిరుమలరావు సారధ్యంలో పోలీస్ శాఖ పలు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ఈ నేపధ్యంలో ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ ల పై వస్తున్న వార్తలను దృష్టిలో ఉంచుకుని విజయవాడ నగరంలో నిఘా పెంచడం జరిగింది. ఎవరైనా వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్లు నిర్వహించే మరియు బెట్టింగు కట్టే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించడంతో పాటు చాకచక్యంగా వ్యవహరించడం ద్వారా దాడులు నిర్వహించి బెట్టింగ్ కు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విధి నిర్వహణలో ప్రతిభ చూపిన టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బందినిల‌ను సీపీ అభినందించారు.

Just In...