Published On: Mon, Sep 21st, 2020

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు ర‌ట్టు..

* బెజ‌వాడ కేంద్రంగా సాగుతున్న వ్య‌వ‌హారం

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: బెజవాడ కేంద్రగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. ఆన్‌లైన్‌లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్‌లు నిర్వహించిన ముఠా. బెజవాడలో ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్న తూర్పు గోదావరి జిల్లా ముఠా. పోలీసుల అదుపులో నిందితులు. అన్ లైన్  సెటప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు. డీసీపీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలిసింది. బెట్టింగ్ ఎక్విప్మెంట్ మొత్తం స్వాధీనం చేసుకున్నా అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారు. బాగా తెలిసిన వాళ్ళ
ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ లో ఆడతారు. రూ.12 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చింది. ప్రధాన సూత్రధారి నవీన్‌ను త్వరలో అదుపులోకి తీసుకుంటాం. ఐపీఎల్ రోజుల్లో పోలీసులకు బెట్టింగ్ పై సమాచారం ఇచ్చి ప్రజలు సహకరించాలి. ఈ వ్యాలెట్ ద్వారా నగదు వ్యవహారాలు చేస్తున్నారు. విద్యార్ధులు ఇలాంటి బెట్టింగ్ లకు ఆకర్షితులు కావద్దని కోరుతున్నాం. 

Just In...