Published On: Mon, Nov 5th, 2018

క్రిమినల్స్‌కి అడ్డాగా మారుతున్న ఉండవల్లి సెంటర్

* నడిరోడ్డుపై ఓ యువకుడు కత్తితో హల్ చల్

* సినీఫక్కీలో సెటిల్మెంట్లు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి క్రైం: రాజధాని ప్రాంతానికి కీలకమైన తాడేపల్లిలోని ఉండవల్లి సెంటర్ క్రిమినల్స్ అడ్డాగా మారింది. సోమవారం ఉదయం 8:30 గంటల స‌మ‌యంలో ఉండవల్లి సెంటర్‌లో ప్రదీప్ అనే యువకుడు హల్‌చ‌ల్ చేశాడు. నడిరోడ్డుపై కత్తితో వీరంగం సృష్టించాడు. విషయానికి వస్తే.. ప్రదీప్ సినీ తరహాలో జనతా గ్యారేజ్ అనే పేరుతో సెటిల్మెంట్లు చేస్తున్నాడు. ‘జనతా గ్యారేజ్’ పేరుతో వాట్సాప్ గ్రూప్ సృష్టించి ఏదైనా సమస్య ఉంటే జనతా గ్యారేజ్ ఉంది అంటూ ఎవరి దగ్గరి నుంచి అయినా సమాచారం అందినప్పుడు ఈ తరహా సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలని భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి వద్ద ఉన్న కత్తిని స్వాధీనం చేసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయమై అడిషనల్ ఎస్.పి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కి వచ్చి యువకుడిని విచారించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేయాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు.

Just In...