Published On: Fri, Nov 30th, 2018

క్రీడాకారుల‌ను అభినందించిన సీఎం చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: సౌదీ అరేబియాలోని అబిదాబీలో జరిగిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకాన్ని సాధించిన సీహెచ్ గౌరవ్ శ్యాం దీపక్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. న‌వంబ‌రు 23న  అబిదాబీలో జరిగిన అంతర్జాతీయ ఛాంపియన్ షిప్ పోటీల్లో 12 ఏళ్ళలోపు విభాగంలో పాల్గొని విశ్వవిజేతగా నిలిచిన దీప‌క్ తాడేప‌ల్లిలోని బాలయోగి గురుకులంలో ఏడో తరగతి విద్యార్థి. నాలుగు నెలల కరాటే శిక్షణలో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్ర‌శంసించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో శుక్ర‌వారం ఉద‌యం సీఎం చంద్ర‌బాబును క‌లిసి దీపక్ విజయాన్ని తెలిపిన తాడేపల్లిలోని బాలయోగి గురుకులం ప్రిన్సిపాల్ బి.రాజారావు, కార్యదర్శి కర్నల్ వి.రాములు, ఏపీ కోచ్ కల్యాణ్ సుందరంలు దీప‌క్ తండ్రి నాగ‌రాజు వ్యవసాయ కూలీ కాగా, తల్లి సునీతారాణి అంగన్‌వాడీ కార్యకర్త తాడేప‌ల్లిలోని బాలయోగి గురుకులంలో ఏడో తరగతి విద్యార్థి నాలుగు నెలల కరాటే శిక్షణలో ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్ర‌శంసించారు. అలాగే ప్రధానంగా స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారి మీదుగా స్కేటింగ్ చేస్తూ ఒంటరిగా దేశంలోని ప్రధాన నగరాలు, రాష్ట్రాలను చుట్టి రానున్న రాణా సెప్టెంబరు 5న స్కేటింగ్ చేయడం ప్రారంభించి డిసెంబరు 19న స్కేటింగ్ యాత్రను ముగించనున్న విశాఖపట్నానికి చెందిన రాణా. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు, పిల్లలకు సాంఘిక సమస్యలపై అవగాహన, సేఫ్టీ, మంచి, చెడు అలవాట్లపై చైతన్యపరుస్తున్న రాణాను సీఎం చంద్ర‌బాబు నాయుడు అభినందించి, సన్మానించారు. దేశ‌వ్యాప్తంగా 25 వేల మంది బాలికలకు విద్యనందించాలని స్కేటింగ్ యాత్ర చేస్తున్న రాణా లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షను సీఎం చంద్ర‌బాబు వ్యక్తం చేశారు. స్కేటింగ్ యాత్రపై Titan company.in/achoలో ఎప్పటికప్పుడు వివరాలు పొందుపరుస్తున్నట్లు రాణా తెలిపారు.
 

Just In...