Published On: Tue, Jun 12th, 2018

క్రీడ‌ల్లో ప్ర‌తిభా స‌ర్టిఫికేట్ల అప్‌లోడ్‌కు 20 వ‌ర‌కు గ‌డువు

* టెట్ కన్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్) ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్‌కు సంబంధించి గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో ఇన్సెంటివ్ మార్కుల కోసం ద‌ర‌ఖాస్తు చేసిన అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా క్రీడ‌ల్లో తాము సాధించిన ప్ర‌తిభా ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాల‌ని టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. త‌మ ప్ర‌తిభా స‌ర్టిఫికేట్ల‌ను టెట్ వెబ్‌సైట్‌లో ఈ నెల 20 లోగా అప్‌లోడ్ చేయాల‌ని టెట్ పీఈటీ అభ్య‌ర్థుల‌కు ఆయ‌న‌ సూచించారు. ఈ మేర‌కు క‌న్వీన‌ర్ సోమ‌వారం ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  టెట్-2018 కి సంబంధించి  గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ఇన్సెంటివ్ మార్కుల కోసం వివిద కేట‌గిరీల్లో  5216 మంది ద‌ర‌ఖాస్తు చేశార‌న్నారు. జూన్ 20 తేదీ అర్ధ‌ రాత్రి 12 గం.ల‌లోగా ఈ అభ్య‌ర్థులు తాము సాధించిన ప్ర‌తిభా సర్టిఫికేట్ల‌ను టెట్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాల‌ని, అప్ లోడ్ చేసిన స‌ర్టిఫికేట్ల‌ను సంబంధిత ఫెడ‌రేష‌న్లు, యూనివ‌ర్శ‌టీలు, స్కూల్ గేమ్స్ ఫేడ‌రేష‌న్ల‌కు పంపుతామ‌న్నారు.  ప్ర‌తిభా స‌ర్టిఫికేట్ల‌ను ప‌రిశీలించి, వాస్త‌వ‌మ‌ని నిర్ధారించుకున్న‌ త‌ర్వాతే ఇన్సెంటివ్ మార్కులు  క‌లుపుతామ‌ని టెట్ క‌న్వీన‌ర్ స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఉద‌యం 9. గం.ల నుంచి టెట్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసుకొనే అవ‌కాశం వుంటుంద‌ని ఆయ‌న తెలిపారు.
రెండోరోజూ ప్ర‌శాంతంగా టెట్..
రెండో రోజూ అన్ని ప‌రీక్షా కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష (టెట్) ప్ర‌శాంతంగా జ‌రిగింది.  అభ్య‌ర్థుల‌కు ఎక్క‌డా ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా రెండో రోజు టెట్  ముగిసింది. మొత్తం 48195 మంది ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యార‌ని  టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి  సోమ‌వారం విడుద‌ల చేసిన పత్రికా ప్ర‌క‌ట‌నలో  పేర్కొన్నారు.  పేప‌ర్ 1 ఎస్టీటీకి సంబంధించి ప‌రీక్ష నిర్వ‌హించామ‌ని, ఈ ప‌రీక్ష‌కు 49,960 మంది ద‌ర‌ఖాస్తు చేయ‌గా 48216 అభ్య‌ర్థులు హాజ‌ర‌య్యాయ‌ర‌ని అన్నారు. రెండోరోజు 96.51 శాతం మంది టెట్‌కు హాజ‌ర‌య్యార‌న్నారు. మొత్తం 102 సెంట‌ర్ల‌లో ప‌రీక్ష నిర్వ‌హించామ‌న్నారు. జూన్ 19 వ‌రకు టెట్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. టెట్ ప‌రీక్ష ముగిసిన వెంట‌నే బ‌ట‌న్ నొక్క‌గానే అభ్య‌ర్థుల‌కు త‌మ‌త‌మ మార్కులు స్రీన్ పై క‌నిపించాయి. ఈ మార్కుల వివ‌రాల‌ను అభ్య‌ర్థుల మొబైళ్ల‌కు మంగ‌ళ‌వారం పంపిస్తామ‌ని టెట్ క‌న్వీన‌ర్ ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. మంగ‌ళ‌వారం జ‌రిగే టెట్ ప‌రీక్ష‌కు అన్ని ఏర్పాట్లు చేశామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

Just In...