Published On: Wed, Mar 27th, 2019

క్రెడాయ్ విజయవాడ చాప్టర్ నూతన కార్యవర్గం ఎన్నిక

సెల్ఐటి న్యూస్‌, విజయవాడ: 2019 నుంచి 2021 వరకు క్రెడాయ్ విజయవాడ నూతన  కార్యవర్గాన్ని ప్రకటించారు. బుదవారం మ‌హాత్మాగాంధీ రోడ్డులోని ఓ హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో క్రెడాయ్ విజయవాడ నూతన చాప్టర్ అధ్యక్షునిగా ఆర్.వి.స్వామి, వైస్ ప్రసిడెంట్‌గా రామ్మోహన్‌రావు, రవికుమార్, జనరల్ సెక్రటరీగా రాంబాబు, శ్రీధర్, అంకిరెడ్డిలు జాయింట్ సెక్రటరీలుగా, ట్రెజరర్‌గా శ్రీరామ్ ఎన్నికైన‌ట్లు ప్రకటంచారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు ఆర్.వి.స్వామి మాట్లాడుతూ ఈ నూతన కమిటీ 2019 ఏఫ్రిల్ 1 నుంచి 2021మార్చి 31 వరకు కోనసాగుతుందని తెలిపారు. నోట్ల రద్దు, జీయస్టీ, రిజిస్ట్రేషన్ వల్ల గృహ నిర్మాణం సంక్షోభం ఏదుర్కోంటుందని తెలిపారు. స్టాంపు డ్యూటీ 7.5శాతం వల్ల ఆర్థిక భారం పెరుగుతుందని, 2.5శాతం మార్చాలని వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఈ విధంగా తగ్గించడం జరిగిందన్నారు. సిమెంట్ రేటు ఎన్నికల తరువాత సమీక్ష నిర్వహిస్తామ‌ని తెలిపారన్నారు. ఇసుక మూడు వేల నుంచి ఎనిమిది వేల వరకు పెరగినందున ఇసుక రిచ్ కేటాంయించాల్సిందిగా కోరారు. ఈ డిమాండ్ల నెరవేర్చి నిర్మాణ రంగ అభివృద్ది తోడ్పడాలని కోరారు. జియస్టి 18 శాతం నుంచి 5 శాతం తగ్గించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు రమణరావు, కార్యవర్గ సభ్యులు, కె.వి.వి.రవికుమార్, మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Just In...