Published On: Sun, Apr 21st, 2019

క్రైస్త‌వుల‌కు సీఎం చంద్ర‌బాబు ఈస్ట‌ర్ శుభాకాంక్ష‌లు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఈస్టర్ పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశ విదేశాల్లోని క్రైస్తవ సోదరులు అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. యేసుక్రీస్తు మానవత్వాన్ని, శాంతియుత సహజీవనాన్ని చాటిచెప్పార‌ని,  సమాజానికి ‘శాంతి-సమాధానం’ జీసెస్ ఇచ్చార‌ని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు మార్గదర్శకం, అనుసరణీయం అన్నారు. గత 5ఏళ్ల పాలనలో ఏపిలో మత సామరస్యం, శాంతియుత సహజీవనం కోసం కృషి చేశాం అన్నారు. క్రైస్తవ సోదరుల సంక్షేమానికి వినూత్న సంక్షేమ పథకాలు తెచ్చామ‌ని తెలిపారు. శాంతి-భద్రత, సోదరభావం-పరమత సహనమే క్రీస్తు  మార్గం అని ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Just In...