Published On: Thu, Mar 26th, 2020

క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల‌కు ఉద్యోగ సంఘాల విరాళం రూ.100 కోట్లు

* సీఎం జ‌గ‌న్‌కు లేఖ‌లు అంద‌జేసిన ఉద్యోగ సంఘాల నేత‌లు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: ముఖ్యమంత్రి సహాయ నిధికి ఏపి ఉద్యోగ సంఘాలు ఒక రోజు జీతం విరాళాన్ని ప్ర‌క‌టించాయి. ఈ మేర‌కు కోవిడ్‌–19 నివారణా చర్యలకు ఉద్యోగ సంఘాల విరాళం త‌ర‌ఫున క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను కలిసి లేఖలు సమర్పించిన ఉద్యోగ సంఘాల నేతలు. సీఎంను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, కార్యదర్శి రమేష్, ఆంధ్రప్రదేశ్‌ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ రెవిన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ వై.వి.రావు, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ సోమేశ్వర‌రావు ఉన్నారు. ఈ సంద‌ర్భంగా వెంక‌ట్రామిరెడ్డి మాట్లాడుతూ త‌మ సంఘాల నుంచి ఒక రోజు విరాళం రూపంలో దాదాపు రూ.100 కోట్లు ఉంటుంద‌ని తెలిపారు. కోవిడ్‌ –19 నివారణ కోసం సీఎం తీసుకుంటున్న చర్యలు పటిష్టంగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు. ముందు చూపుతో సీఎం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా విపత్తును ఎదుర్కోవడంలో ముందుంటున్నాయ‌ని తెలిపారు. క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలు బాగున్నాయ‌ని కొనియాడారు. ఈ పరిస్థితుల్లో అండగా ఉండేందుకు ఒకరోజు జీతాన్ని విరాళంగా ఇచ్చిన‌ట్లు వెంకట్రామిరెడ్డి వెల్ల‌డించారు.

Just In...