Published On: Sat, Sep 9th, 2017

క‌ర్ణాట‌క‌లో తెలుగు విద్యార్థులపై దాడి అమానుషం

* దాడిని ఖండించిన ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి

సెల్ఐటి న్యూస్‌,  విజ‌య‌వాడ‌:  కర్ణాటక రాష్ట్రంలో తెలుగు విద్యార్థులపై క‌న్నడ సంఘాల  దాడి ఘటన అమానుష‌మ‌ని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షులు డాక్ట‌ర్ ఎన్‌.ర‌ఘువీరారెడ్డి  ఖండించారు. ఈ మేర‌కు ఆయ‌న ఏపిసిసి రాష్ట్ర కార్యాల‌యం నుంచి శ‌నివారం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.  దాడి ఘటనపై ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు.  కర్ణాటకలో ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థుల‌ను కన్నడ సంఘాలు అడ్డుకున్న విషయం తెలిసిందే. పరీక్షలు రాయడానికి వెళ్లిన తెలుగువారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో   తెలుగు విద్యార్థుల రక్షణకు క‌ల్పించాల‌ని  కర్ణాటక ర‌క్ష‌ణ శాఖ మంత్రి రామ‌లింగ‌రెడ్డితో ర‌ఘువీరారెడ్డి మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు, విద్యార్థుల‌కు  రేపు, ఎల్లుండి జరిగే పరీక్షలకు భద్రత కల్పించాలని   కోరిన్న‌ట్లు ఆయ‌న  తెలిపారు. దీంతో  తెలుగు విద్యార్థులపై దాడికి పాల్ప‌డిన దుండ‌గుల‌పై చ‌ర్య‌లు తీసుకుని ఇటువంటి చ‌ర్య‌లు పున‌ర‌వృతం కాకుండా చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని క‌ర్నాట‌క హోం మంత్రి రామ‌లింగ‌రెడ్డి హామీ ఇచ్చిన్న‌ట్లు ర‌ఘువీరారెడ్డి తెలిపారు.
Raghuveera-Reddy_7

Just In...